రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 21భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
కొత్వాల నాయకత్వంలో పాల్వంచలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను యావత్ భారతదేశం ప్రజలు ఖండిస్తున్నారని, అమిత్ షా ను కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుఅన్నారు.
అమిత్ షా భారతరత్న అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు నిరసన* కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో కొత్వాల నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన అమిత్ షా, అంబేద్కర్ పై వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని అన్నారు. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని, ఆయన యావత్ భారత దేశ ప్రజలకు ఆరాధ్యుడు అని కొత్వల అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రం పరిగణించి, అమిత్ షా ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని కొత్వాల డిమాండ్ చేశారు. తక్షణమే అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని కొత్వాల.వెల్లడించారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, మహీపతి రామలింగం, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కాల్వ భాస్కర రావు, బద్ది కిషోర్, ఎస్ వి ఆర్ కె ఆచార్యులు, కనగాల నారాయణరావు, బాలినేని నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు, జమ్ముల సీతారాంరెడ్డి, కాపర్తి వెంకటాచారి, చింతా నాగరాజు, కాపా శ్రీను, వాసుమల్ల సుందర్ రావు, కందుకూరి రాము, ఎస్.కె చాంద్ పాషా, దారా చిరంజీవి, పైడిపల్లి మహేష్, బాశబోయిన అశోక్, ఉండేటి శాంతివర్ధన్, కటుకూరి శేఖర్, భూక్యా గిరి ప్రసాద్, కొత్తపల్లి రవి, వీరమల్ల గణేష్, బండి నాగరాజు, ఎస్.కె సత్తార్, కొండలరావు, నగేష్, రాము, నల్లమల్ల సత్యం, ఏలూరి రామారావు,తదితరులు పాల్గొన్నారు.