బదిలీపై వెళ్తున్న హోంగార్డులకు సన్మానం
ప్రశ్న ఆయుధం కామారెడ్డి, జూన్ 9.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఉత్తర్వులపై, గత కొన్ని సంవత్సరాల నుండి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సమర్ధవంతముగా విధులు నిర్వర్తించిన ఏడుగురు హోంగార్డులకు బదిలీపై వెళ్తున్న సందర్బంగా సోమవారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారికీ వారి స్దాన చలనంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో బదిలీ అయిన హెచ్ జి ఓ ఎస్ మురళి,బాలరాజు,రాజిరెడ్డి, బషీర్,ప్రభాకర్,అక్తర్,మైసయ్యలు మరియు పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై,సిబ్బంది పాల్గొన్నారు.వారు పోలీస్ స్టేషన్ కి అందించిన సేవలను, ప్రజలకు దగ్గరైన విధానాన్ని, వృత్తి పట్ల అంకితభావంతో చేసిన పనులను కొనియాడడం జరిగింది.