నందికంది గ్రామంలో ఇంటింటి సర్వే

సంగారెడ్డి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలం నందికంది గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు వైద్య బృందం గ్రామంలో సర్వే చేపట్టింది. సోమవారం డాక్టర్లు ప్రేమలత, మౌనిక, ప్రియాంకలతో పాటు ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీ వీరన్న ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అలాగే ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు, దోమలు కలిగే పరిస్థితులను చూసి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింటూ గౌడ్, మన్నే వరప్రసాద్, యువన్, దుర్గాబాయి, హరికృష్ణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now