చదువులకు నిలయాలు శిశు మందిరాలు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

చదువులకు నిలయాలు శిశు మందిరాలు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

నిజామాబాద్ ప్రశ్న ఆయుధం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 ఆర్మూర్ మండలం.

సరస్వతి శిశుమందిరం 43వ వార్షికోత్సం సందర్బంగా ఏర్పాటు చేసిన శిశుమందిరం పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సరస్వతి శిశు మందిరం అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారే కొలువై ఉన్న ప్రదేశాలు అని విద్యతో పాటు సకల కలలకు పెట్టింది పేరు అని అన్నారు.భావి భారత పౌరులకు చదువులమ్మ తల్లి ఒడిలో విద్యతో పాటు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను భోదించే ఏకైక పాఠశాలలు శిశు మందిరాలన్నారు.విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని భోదిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో జాతీయ పునర్నిర్మానము వైపు అడుగులు వేస్తున్న ఏకైక విద్యసంస్థలు మన శిశు మందిరాలు అని ప్రశంసించారు.

IMG 20241229 WA0071

మందిరాలు ఏర్పడి అర్ద శతబ్దం (50ఏళ్ళు ) అవుతున్న విద్యలో కాని విలువల్లో కాని ఎటువంటి మార్పు లేదని ,మొక్కగా ప్రారంభం అయి నేడు మహా వృక్షంల ఎదిగి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలలో నిలబెట్టి వారిని జాతీయ పునరనిర్మాణంలో భాగస్వాములను చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు.విద్యార్థి దశ నుండే విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక ఉల్లాసం కోసం ఆటలు, వ్యాయామం, యోగ, సంగీతం కళాత్మక, నైతిక ఆధ్యాత్మిక సంస్కృతిని అందించడం జాతికి గర్వకారణం అన్నారు.క్రమ శిక్షణకు మారుపేరుగా శిశు మందిరం విద్యార్థులు నేడు సమాజంలో ఉన్నత స్థానాలలో IAS, IPS లుగా, బిజినెస్ మాన్ లుగా, రాజకీయ నాయకులుగా ఎందరినో ఉన్నత స్థానాలలో నిలబెట్టి వారు ఎక్కడ ఉన్న ఏ స్థానంలో ఉన్న ఈ దేశం కోసం ధర్మం కోసం జాతీయ పునర్నిర్మానము కోసం వారిని కంకణ బద్దులుగా చేసిన ఘనత శిశుమందిరాలదే అన్నారు.శిశు మందిరాలలో విద్యను అభ్యసించడం అదృష్టంగా భావించి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా,ఉన్నత లక్ష్యం సాధించే దిశగా లక్ష్యం చేరే వరకు విశ్రామించకుండా ఉన్నత శిఖరాలను అవరోధించి ఈ దేశ పునర్నిర్మానము లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

 

 

Join WhatsApp

Join Now