హోండా డబుల్‌ ధమాకా.. 2 విద్యుత్‌ స్కూటర్లు ఆవిష్కరణ

*హోండా డబుల్‌ ధమాకా.. 2 విద్యుత్‌ స్కూటర్లు ఆవిష్కరణ*

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ స్కూటర్ ఇండియా దేశీయంగా తొలిసారి విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది. హోండా యాక్టివా ఈ (Activa e), క్యూసీ 1 (QC1) పేరుతో రెండు స్కూటర్లను తీసుకొచ్చింది.ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ స్కూటర్ ఇండియా (Honda) దేశీయంగా తొలిసారి విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది. హోండా యాక్టివా ఈ (Activa e), క్యూసీ 1 (QC1) పేరుతో రెండు స్కూటర్లను ప్రదర్శించింది. యాక్టివా ఈవీని తీసుకొస్తారని ఎప్పటినుంచో రూమర్స్‌ ఉండగా.. దానికి తెరదించింది. ఈ స్కూటర్‌ను స్వాపబుల్‌ బ్యాటరీతో వస్తుండగా.. క్యూసీ1 ఫిక్స్‌డ్‌ బ్యాటరీతో వస్తోంది.

 

తన పాపులర్‌ స్కూటర్‌ పేరును కొనసాగిస్తూ యాక్టివా ఈ (Honda Activa e)ని తీసుకొచ్చింది. పేరుతో పాటు డిజైన్‌నూ అందిపుచ్చుకుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, సైడ్‌ ఇండికేటర్ల విషయంలో చిన్న చిన్న మార్పులు చేశారు. ఇందులో రెండు 1.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీలను అమర్చారు. సింగిల్‌ ఛార్జ్‌తో 102 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. టాప్‌స్పీడ్‌ గంటకు 80 కిలోమీటర్లు. స్టాండర్డ్‌, స్పోర్ట్‌, ఎకానమీ పేరుతో మూడు రైడింగ్‌ మోడ్‌లను అందిస్తోంది.

హోండా క్యూసీ 1ను భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా హోండా తీసుకొచ్చింది. తక్కువ దూరం ప్రయాణాల కోసం దీన్ని డిజైన్‌ చేశారు. యాక్టివాను పోలి ఉన్నప్పటికీ.. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ను ఇవ్వలేదు. ఇందులో 1.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఇది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. దీని టాప్‌ స్పీడ్‌ 50 కిలోమీటర్లు. 5 అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంటల్‌ ప్యానెల్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి ఫీచర్లను అందిస్తోంది.

ఈ రెండు స్కూటర్లకు సంబంధించిన బుకింగ్స్‌ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ధరల వివరాలు సైతం అప్పుడే వెల్లడి కానున్నాయి. వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరుకు దగ్గర్లోని తన ప్లాంట్‌లో హోండా తయారుచేయనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టీవీఎస్‌ ఐక్యూబ్‌, హీరో మోటోకార్ప్‌ విదా, బజాజ్‌ చేతక్‌, ఏథర్‌ రిజ్తా, ఓలా ఎస్‌1 ప్రో వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

Join WhatsApp

Join Now