Site icon PRASHNA AYUDHAM

ప్రమోషన్ పొందిన కే టి ఏ సభ్యులకు సన్మానం

IMG 20240825 WA0273

*ప్రమోషన్ పొందిన కొడకండ్ల టీచర్ అసోసియేషన్ సభ్యులకు సన్మానం*

గజ్వేల్ ఆగస్టు 26 ప్రశ్న ఆయుధం :

కె టి ఎ సమావేశం కొడకండ్ల టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుప్పతి రాములు అధ్యక్షతన ఎం పి పి ఎస్ కొడకండ్ల లో జరిగింది.ఈ కార్యక్రమంలో ఇటీవల ప్రమోషన్ పొందిన కె టి ఎ సభ్యులు దూలం వెంకటయ్య ఎస్ ఎ హిందిగా మరియు, గజ్వేల్ వెంకట్ కిరణ్ ఎస్ ఎ (మాథ్స్) సన్మానించారు.కె టి ఎ అధ్యక్షుడు టి. రాములు మాట్లాడుతూ కె టి ఎ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలను చేస్తున్నాము,కరోనా మహమ్మారి సమయంలో పారిశుద్ధ్య కార్మికుల కు నిత్యావసర సరకులను అందించాము,అలాగే కరోనా సోకిన వారిని కూడా అదుకున్నాం అని అన్నారు.ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు డి. వెంకటయ్య , జి. వెంకట్ కిరణ్ మాట్లాడుతూ మాకు ప్రమోషన్ రావడం సంతోషంగా ఉంది అన్నారు.ఎస్ జి టి దాదాపు 21 సంవత్సరాలు సేవలు అందించిన తరువాత ప్రమోషన్ వచ్చింది అన్నారు, పి ఎస్ ఎచ్ ఎం గా ప్రోమోషన్ ఇస్తే దాదాపు సీనియర్ ఎస్ జి టిలందరికి ప్రమోషన్ వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కె టి ఎ నాయకులు పి. శ్రీనివాస్ రావు, సిఎచ్ రాంచంద్రం, డి.శ్రీశైలం, డి.ప్రభాకర్ పి.రాము, ఎం. వేణుగోపాల్ మరియు ఎం. భాస్కర్ పాల్గొన్నారు.

Exit mobile version