Headlines :
-
ఛత్తీస్‌గఢ్‌లో కన్నతండ్రి చేతిలో కూతురు, మేనకోడలు అత్యాచారానికి గురైన దారుణం
-
మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన – ఛత్తీస్‌గఢ్‌లో తండ్రి చేతిలో మైనర్లు బాధితులు
-
2020 అత్యాచార కేసులో జైలుపాలైన వ్యక్తి మళ్లీ దారుణానికి పాల్పడ్డ ఘటన
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మానవ సంబంధాలు మంటగలిపేలా ఓ వ్యక్తి మైనర్లయిన కన్న కూతురు, మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 19న ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడని, 21న కలప కోసం అడవికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు నిందితుడు తన మేనకోడలిపై అక్టోబర్ 21 అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితుడు 2020లో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి ఇటీవల పెరోల్‌పై రిలీజ్ కావడం గమనార్హం.