*ఉద్యానవన శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి…*
*ఈదురు గాలులు అకాల వర్షాలతో,మొక్కజొన్న, వరి, మామిడి, సపోట బొప్పాయి, జామ, నిమ్మ తదితర దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించాలి*
*ఈదురు గాలులకు దెబ్బతిన్న పంటలను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసి, నష్టపరిహారం ప్రకటించాలి*
సీపీఎం పార్టీ జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు…
మధిర నియోజకవర్గo వ్యాప్తంగా నిన్న మంగళవారం ఏప్రిల్ 15 ను రాత్రి, ఇదేనేల ఏప్రిల్ 7న అకాల వర్షo,ఈదురు గాలుల బీభత్సంతో దెబ్బతిన్న పంటల ఇతరులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వన్ని *సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య,మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు* డిమాండ్ చేస్తూ ప్రకటన జారిచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు లక్షలు వెచ్చించి పెట్టుబడులు పెట్టి పంట చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షాలు బీభత్సంగా ఇస్తున్న ఈదురు గాలులతో మొక్కజొన్న,వరి పంటల రైతులు మరియు మామిడి,సపోట,బొప్పాయి, జామ, నిమ్మ పండ్ల తోటల పెంపకం రైతులు ఈదురు గాలుల ధాటికిపంట చేతికొచ్చే సమయంలో పండ్ల పంట నేల రాలడంతో పాటు చెట్లు కూడా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడం దురదృష్టకరం,బాధాకరమన్నారు.మామిడి పంట ప్రారంభ దశలో మంచు ప్రభావంతో సక్రమంగా పూత రాక,అంతో ఇంతో పూత వచ్చి పిందె వచ్చినా ఎక్కువ ఎండల వల్ల పిందెలురాలిపోయాయని, మందులు కొట్టి అరకొరగా పిందెలు నిలబెట్టుకుని అంతో ఇంతో దిగుబడి వస్తున్న తరుణంలో అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు .ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి వారు విన్నవించారు.
ఖరీఫ్, రబీ సీజన్ లలో పంటలు రాక తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతన్నలకు ఈ అకాల వర్షాలు,ఈదురు గాలులతో మరిన్ని కష్టాలు తోడయ్యాయన్నారు. వరి మొక్కజొన్న నేలకొరిగిన విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే ప్రభుత్వం అమలు నమోదు చేయమని చెప్పలేదని రైతులకి చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యానవన శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న వివరాలను సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేధించాలని కోరారు.
అకాల వర్షాలు,ఈదురు గాలుల వల్ల, దెబ్బతిన్న మామిడి,ఇతర పంటల వివరాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని,రైతులను ఆదుకోవాలని కోరినట్లు దివ్వెల వీరయ్య,మద్దాల ప్రభాకరరావు తెలిపారు. పంట నష్టం అంచన నమోదు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సర్క్యులర్ ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేయాలని వివిధ శాఖలకు సర్కులర్ జారీ చేసి పంట నష్టపరిహారం వెంటనే ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు…