గుండె సంబంధిత వ్యాధితో గృహిణి మృతి

గుండె సంబంధిత వ్యాధితో గృహిణి మృతి

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 22

 

 

కామారెడ్డి జిల్లా – సోమారం తండాకు చెందిన

భూక్యా కమిలి (32) అనే గృహిణి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే — మృతురాలు కమిలి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 20వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో భర్త భూక్యా రవి పొలానికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకున్నది.

 

తమ్ముడు గమనించి వెంటనే ఆమెను కిందికి దించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

— పోలీసుల వివరాలు

మహిళ మృతికి గుండె వ్యాధే కారణమా? లేక వేరే కారణాలున్నాయా? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment