పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేసిన గోదావరి ముంపు బాధితులు, నిరుపేదలు
పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణ సాగర్ పంచాయతీ అటవీ ప్రాంతంలో సీతారామ కాలువ సమీపంలో గోదావరి వరద ముంపు బాధితులు నిర్మించుకున్న నిరుపేద గుడిసె వాసులకు గృహవసతి మరియు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం నాడు మణుగూరు స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి నిరుపేదల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కలిసి తమ కష్టాలను చెప్పుకోవడంతోపాటు ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి ముంపు బాధితుల మరియు ఇండ్లు లేని నిరుపేదల పోరాట కమిటీ కార్యదర్శి సున్నం భూలక్ష్మి మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు అశ్వాపురం బూర్గంపాడు మండలం చెందిన ఇండ్లు లేని నిరుపేదలు గోదావరి ముంపు బాధితులు సుమారు మూడు వందల అరవై మంది పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి ఆందోళనలు చేస్తున్నామని గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా సమస్యను వారి దృష్టి కూడా తీసుకువెళ్లామని అప్పట్లో ఆయన సానుకూలంగా స్పందించారని ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని పేదలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారని. అట్టి హామీతో ఇందిరమ్మ రాజ్యంలో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామని బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ అటవీ ప్రాంతంలో సీతారామ సాగర్ కాలువ సమీపంలో నిరుపయోగంగా ఉన్న భూమిలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నామని త్రాగునీరు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని దోమలతో సహజీవనం చేస్తున్నామని సుమారు పదమూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసుకున్నామని తమ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా పోలీసు శాఖ సహకారంతో తమ గుడిసెలు ఖాళీ చేసేందుకు నీటిపారుదల శాఖ మరియు ఫారెస్ట్ అధికారులు సమాయాతం అవటంతో పాటు ప్రయత్నాలు ముమ్మరం చేశారని నిరుపేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ శాఖ అధికారులు తమపై దాడి చేస్తే తమా గోస ఎవరికి చెప్పుకోవాలని వారు వాపోయారు. తమ ప్రాంత గౌరవ ఎమ్మెల్యేగా తమకు అండగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి అయినా సరే తమ సమస్యను పరిష్కరించాలని చింత లక్ష్మీ నగర్ కు గృహవసతి మరియు రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గృహ పోరాట కమిటీ సభ్యులు కోడిమి రాధా, రాపర్తి లక్ష్మి, మరల కృపారాణి, సోడే అచ్చమ్మ, బిల్లా చంద్రకళ, వెంకటమ్మ, రమణ, తదితరులు పాల్గొన్నారు.