Site icon PRASHNA AYUDHAM

రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయించిన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధికి అభద్రతే..?

IMG 20250320 WA0365

ప్రజా పాలన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చ్ 20

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వం అభివృద్ధి దిశగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధికి దోహద పడటం లేదని అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో గురువారం మాట్లాడారు.ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాల రైతుల అభివృద్ధిని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ప్రాంతం పేరుతో అవకాశాలు కల్పించడం లేదనిఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి బడ్జెట్ కేటాయించిన ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు అభివృద్ధిలో అభద్రత భావంతో బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.పాలన సౌలభ్యం కోసం ఏరుపడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంత నిరుపేద దళితుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి అభివృద్ధిని కోల్పన ఎస్సీ కులాలను అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version