టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల స్టాప్ రిపోర్టర్ ఏప్రిల్ 16
సుజాతనగర్ మండల కేంద్రంలోని గరి పేట గ్రామంలో
సన్న బియ్యం లబ్ధిదారుడు నర్సింగ్ వీరయ్య కుటుంబంతో కలిసి భోజనం టీపీసీ సభ్యులు నాగ సీతారాములు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న రేషన్ బియ్యం పథకం అమలు పట్ల ప్రజల్లో స్పందన తెలుసుకునే క్రమంలో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడు సుజాతనగర్ గరీబ్ పేట గ్రామస్తులు నర్సింగ్ వీరయ్య ఇంట్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో వెళ్లి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు భోజనం చేశారు. సన్నబియ్యం అన్నం ఎలా ఉందమ్మా..! అని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో డీలర్ దగ్గరకు వెళ్లి సన్న బియ్యం తెచ్చుకొని సంతోషంగా వండుకుని తింటున్నామని లబ్ధిదారులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వసంత చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉన్నాయని సన్న బియ్యం అన్నం ఎంతో రుచిగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా భోజనాలు చేస్తున్నారని చిన్నపిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారన్నారు. అందరికీ సమాజంలో సమానత్వం కల్పించేలా ఉన్నవాడైన లేనివాడైన ఒకే రకమైన భోజనం చేయాలని మంచి సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పేదలకు అందజేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని అన్నారు. అన్న మా ఇంటికి రండి భోజనం చేయండని సోదరీమణులు ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సన్న బియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులందరికి అవి అందేలా చూడలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఆప్యాయంగా తనను ఇంటికి భోజనానికి పిలిచిన నర్సింగ్ వీరయ్య వసంత దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా ఓబీసీ సెల్ బొబ్బల వెంకట్ యాదవ్ బీసీ సెల్ అధ్యక్షులు కసనబోయిన లక్ష్మణ్ నర్సింగ్ బిక్షం రెడ్దిమల్ల వెంకన్న పెద్ద వెంకన్న రాములు బి రవి ఉపేందర్, వల్లపు పద్మ, వీరమ్మ, కృష్ణవేణి సోషల్ మీడియా మండల కో-ఆర్డినేటర్ బిరేల్లి వీరభద్రం మార్తి వెంకన్న కసనబోయిన రామ్మూర్తి మధు తిరుపతి శ్రీను, వెంకటేష్, వేణు మరియు స్థానికులు పాల్గొన్నారు