Site icon PRASHNA AYUDHAM

మంచిర్యాల: పెళ్లి కాదేమోనని యువకుడి ఆత్మహత్య

యువకుడి
Headlines
  1. మంచిర్యాల: పెళ్లి కాదేమోనని 30 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
  2. పెళ్లి సంబంధాలు నెరపలేక మనస్థాపం – మంచిర్యాల యువకుడి విషాదాంతం
  3. ఆత్మహత్యకు దారితీసిన మానసిక ఆందోళన: పెళ్లి భయంతో మద్యానికి బానిసై యువకుడు మరణం
మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ కు చెందిన శ్రీరాముల అనుదీప్ (30) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు. అనుదీప్ తండ్రి జగన్ గతంలోనే చనిపోగా డ్రైవర్ పని చేసుకుంటూ తల్లి ఉమతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మనస్థాపానికి గురై గతంలో ఓసారి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పెళ్లి కాదేమోనని మనస్థాపనతో మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
Exit mobile version