పెళ్లి ఒక్కరిది, పత్రాలు మరొకరివి..
– బిక్నూర్ మండలంలో కళ్యాణలక్ష్మి లో భారీ అవకతవకలు
– తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో…?
– భారీగా చేతులు మారినట్లు సమాచారం..?
– ఆర్ టి ఐ ద్వారా వెలుగులోకి..
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో కళ్యాణ ఎలక్షన్ లో భారీగా అవకతవకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని అధికారులు కొందరు రాజకీయ నాయకులు కలిసి అపహస్యం చేసినారు. బిక్నూర్ మండల తాసిల్దార్ 2020 – 2022 మధ్య లో ఓ కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పించేందుకు ధ్రువీకరణ పత్రాలు ఒకరివి పెట్టి మరో ఒకరికి కళ్యాణ లక్ష్మిని అప్పజెప్పినట్లు ఆర్ టి ఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో విషయం తెలుసుకోగా ఇంకొక అమ్మాయికి పెళ్లి ఆమెకు పదవ తరగతి సర్టిఫికెట్ లేకపోవడంతో ఆమె కోసం ఈ అమ్మాయి సర్టిఫికెట్ను వాడుకున్నట్లు ఆర్.టి.ఐ సమాచారం వెళ్లడయింది. అధికారులు ఇచ్చిన పత్రాల్లో సైతం ఆధార్ కార్డు పెళ్లయిన అమ్మాయిది ఉంటే పదవ తరగతి సర్టిఫికెట్ మాత్రం పెళ్లి కాని అమ్మాయిది పెట్టారు. ఇది ఫేక్ అని తెలిసిన సంబంధిత తాసిల్దార్ తనకు డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా వారికి కల్యాణ లక్ష్మిని మంజూరు చేయించారు. ఈ విషయంపై కామారెడ్డి ఆర్ డి ఓ ను సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆమె ఫోన్ అందుబాటులోకి రాలేదు. బయటకు వచ్చింది విషయం ఒకటే ఇంకా రానివి ఎన్ని ఉన్నాయని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవకతవకలు ఇకముందు జరగకుండా జిల్లా అధికారులు మండల తాసిల్దార్ పై తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజల కోరుతున్నారు.