కోల్ కత్తా హత్య చార సంఘటనకు నిరసనగా పి ఓ డబ్ల్యు ,పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మణుగూరులో భారీ ర్యాలీ
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంఘటన కోల్ కత్తా హత్య చార సంఘటనకు నిరసనగా ప్రగతిశీల మహిళా సంఘం (పి ఓ డబ్ల్యు) ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్ యు ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మణుగూరు పట్టణంలో విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో జరిగిన సభలో పి ఓ డబ్ల్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి సున్నం భూలక్ష్మి, ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం ప్రణయ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కోల్ కత్తా డాక్టర్ పై సామూహిక అత్యాచారం ఆపై హత్య సంఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు నిరసించాలన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటన పట్ల కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిచే జ్యుడీషియల్ విచారణ జరిపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటన పునరావతం కాకుండా చూడాలని మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినుల నినాదాలుతో పట్టణంలో హోరెత్తించారు. చేశారు.ర్యాలీకు సహకరించిన స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థినిలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం ప్రణయ్, (పిడిఎస్ యు) పిఓడబ్ల్యూ నాయకులు సున్నం భూలక్ష్మి, రాపర్తి లక్ష్మి, నరసమ్మ, పుష్ప, రజిత, శాంతకుమారి, ఐ ఎఫ్ టియు నాయకులు యస్ డి నా సర్ పాషా మిడిదొడ్ల నాగేశ్వరరావు, అంగోత్ మంగీలాల్, పి వై ఎల్ నాయకులు సాధన పల్లి రవి,న్యూ డెమోక్రసీ నాయకులు నాయిని కొండన్న తదితరులు పాల్గొన్నారు.