Site icon PRASHNA AYUDHAM

భారీగా రెవెన్యూ శాఖలో బదిలీలు..!!

భారీగా రెవెన్యూ శాఖలో బదిలీలు..!!

మహబూబ్ నగర్ : రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు స్థానచలనం జరిగింది.మహబూబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ (బీమా ప్రాజెక్ట్)ముకుందా రెడ్డి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గా పని చేసిన మధుసూదన్ నాయక్ రానున్నారు. వనపర్తి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన ఎం నాగేష్ మెదక్ అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు . మెదక్ లో అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న..

 

జి వెంకటేశ్వర్లు వనపర్తి అదనపు కలెక్టర్ గా రానున్నారు. నారాయణపేట అదనపు కలెక్టర్ పి అశోక్ కుమార్ కు భూపాల్ పల్లి అదనపు కలెక్టర్ గా బదిలీ కాగా.. ఆయన స్థానంలో యాదగిరి బోనగిరి అదనపు కలెక్టర్ గా పని చేసిన బెన్ షెలాం రానున్నారు. వనపర్తి ఆర్డిఓ గా పనిచేస్తున్న ఎస్ పద్మావతికి నారాయణపేట ఎస్ డి సి కి బదిలీ కాగా..ఆమె స్థానములో నల్గొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ అండ్ ఆర్ విభాగంలో పనిచేస్తున్న ధరూరు సుబ్రహ్మణ్యం రానున్నారు.

 

గద్వాల ఆర్డిఓ రామచందర్ కు నారాయణపేట బదిలీ కాగా.. వెయిటింగ్ లో ఉన్న ఎం శ్రీనివాసరావు గద్వాల ఆర్డిఓ గా బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏ గా ఉన్న పి రామ్ రెడ్డి కొల్లాపూర్ ఆర్డిఓ గా బదిలీ అయ్యారు. నరేడ పేట ఆర్డిఓ గా పనిచేస్తున్న సిహెచ్ మదన్మోహన్ వనపర్తి ఎస్ డి సి ,ఎల్ ఏ కు బదిలీ కాగా.. సిహెచ్ వెంకటేశ్వర్లు కు భూపాల్ పల్లి ఎస్బిసి ఎల్ ఏకు బదిలీ అయ్యారు.

Exit mobile version