భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న మాడుగుల సత్యనారాయణ హెచ్ జి నెంబర్ 901 భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడం జరిగింది. ఆమె అనారోగ్య దృష్ట్యా హైదరాబాదులో బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు, ఆపరేషన్ తర్వాత ప్రతిరోజు ఫిజియోథెరపీ కోసం 30000 ఖర్చు అవుతుండగా అతని ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకొని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది కలిసి మానవతా దృక్పథంతో ఆమె వైద్యం కోసం 22,000 డబ్బులను హోంగార్డ్స్ ఇంచార్జ్ శేషు కి అందజేయడం జరిగింది. హోంగార్డు కుటుంబానికి సహాయం చేసిన ట్రాఫిక్ ఎస్ఐ మరియు వారి సిబ్బందికి హోంగార్డ్స్ తరఫున శేషు ధన్యవాదాలు తెలియజేశారు.
మానవత్వం చాటుకున్న భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మరియు సిబ్బంది
