మానవత్వం చాటుకున్న బిజెపి నాయకుడు బారు అరవింద్
గజ్వేల్, 27 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గత కొన్ని రోజులుగా గుర్తుతెలియని మహిళ భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. గురువారం స్థానిక దర్శిని హోటల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ రోడ్డుపై పడి ఉండగా ఆ సంఘటన చూసిన గజ్వేల్ మండల బిజెపి యువ నాయకుడు బారు అరవింద్ వెంటనే 108 కు సమాచారం అందించి ప్రభుత్వ హాస్పిటల్ లో ఆ మహిళకు ట్రీట్మెంట్ అందే విధంగా చూసి, ఆమెకు మనో ధైర్యం కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని మహిళ కి ప్రాణాపాయం లేదని బారు అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ ఒక మహిళను కాపాడిన బారు అరవింద్ ను పలువురు అభినందించారు.