Site icon PRASHNA AYUDHAM

రాజకీయాలకు అతీతంగా మానవత్వం – మైనంపల్లి హనుమంత్ రావు ఉదారత!

IMG 20250826 WA0044

రాజకీయాలకు అతీతంగా మానవత్వం – మైనంపల్లి హనుమంత్ రావు ఉదారత!

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 26

పార్టీ జెండాలు వేరైనా, మానవత్వానికి మాత్రం ఎల్లలు లేవని నిరూపిస్తూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, మైనంపల్లి ట్రస్ట్ వ్యవస్థాపకులు మైనంపల్లి హనుమంత్ రావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

కౌకూర్ భారత్‌నగర్‌కు చెందిన సందపగా రమేష్ , మచ్చ బొల్లారంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. ఇటీవల న్యూరో సంబంధిత సమస్యలు రావడంతో ఈ నెల 7వ తేదీన నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కానీ 12వ తేదీ వరకు పూర్తిగా డిశ్చార్జ్ అయ్యేందుకు కావలసిన నిధులు లేకపోవడంతో, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆసుపత్రి గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ విషయం ఆల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సామాజిక సేవకుడు తుడిమెళ్ల మల్లికార్జున్ , 133వ డివిజన్ కార్పొరేటర్ జితేందర్‌నాథ్ గమనించి, మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మైనంపల్లి , రమేష్ కుమార్తెకు ఎం.ఎస్.ఎస్.ఓ ట్రస్ట్‌ ద్వారా ₹50,000/- సహాయం అందించారు. అంతేకాక నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తో స్వయంగా మాట్లాడి, బిల్లులో గరిష్ట రాయితీ ఇవ్వమని కోరారు.ఈ సందర్భంగా మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి కూడా నిమ్స్ కి వెళ్లి సూపరింటెండెంట్ ని కలిశారు.కౌకూర్ ప్రజల ప్రతినిధులైన శ్రీనివాస్ రావు, భువన్ జ, కె.మోహంతి, రాజేందర్ శర్మ, పంకజ్ త్రిపాఠి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సహాయానికి సహకరించిన మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మానవత్వం ముందు రాజకీయాలు తలవంచేలా చేసిన ఈ ఉదారత మల్కాజ్గిరి ప్రజల హృదయాలను తాకింది.

Exit mobile version