హైదరాబాద్‌లో వందల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి
హైదరాబాద్: మూసీ పునర్జీవం కార్యక్రమంలో నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో తెలుగు కమ్యూనిటీ అండ్ గ్రీట్ సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వందల చెరువులు కనపడకుండా పోయాయని చెప్పారు.
చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాకుండా ఆపాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేందుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికి కూడా మంచిది కాదని భట్టి విక్రమార్క అన్నారు…