ఒకే చెట్టుకు భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య

*ఒకే చెట్టుకు భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య*

*విషయం తెలుసుకున్న స్థానిక ప్రజల కంటతడి*

*నిర్మల్-జనవరి 17:-* నిత్యం సమస్యలతో యుద్ధం చేస్తూ మనిషి జీవితం సగం సమస్యల మధ్య చిక్కుకుపోయి ఉంటున్న రోజులు ఇవి మరికొన్నిచోట్ల అయిన వారే కాదనుకుంటున్న దృశ్యాలు కళ్ళముందు కదలాడుతున్న అయినప్పటికీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తమ జీవితాన్ని కొనసాగించే వ్యక్తులు చాలామంది కనిపిస్తుంటారు. కానీ ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టేలా ఇద్దరు భార్యాభర్తలు ఓకే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే వారికి ఉన్న సమస్యలు కారణమా లేక ఇంకేమైనా ఉండొచ్చా.. అనే కోణంలో అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అలా ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకోవడం సరికాదనే అంశాన్ని సైతం పలువురు ప్రస్తావిస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం భార్యా భర్తలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందినవారని గుర్తించారు. వారు ఇద్దరూ ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now