కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది.. రాత్రికి రాత్రే పెయింటర్ తో లేచిపోయింది

కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది.. రాత్రికి రాత్రే పెయింటర్ తో లేచిపోయింది..

పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో ఉండే ఓ మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రాన ఉండటంతో ఏం చేయాలో బాగా ఆలోచించి, తన కూతురు చదువు కోసం భర్త కిడ్నీని నెలల తరబడి బ్రతిమిలాడి రూ.10 లక్షలకు విక్రయించింది.

ఇంటికి రూ.10 లక్షల రూపాయలు తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తానని భర్తను నమ్మించి రాత్రికి రాత్రే అదృశ్యమైంది.

భర్త అక్కడ ఇక్కడ విచారించగా బరాక్‌పూర్‌ ప్రాంతంలో ఒక పెయింటర్ తో నివసిస్తుందని భర్తకు తెలిసింది.

కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడికి వెళ్లగా నీకు డైవర్స్ నోటీసులు పంపిస్తానని బెదిరించింది.. దీంతో మోసపోయానని గ్రహించి భర్త, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment