Site icon PRASHNA AYUDHAM

నెలకు ఆరు వేల భరణం కట్టలేక.. సెకండ్ వైఫ్ను పోషించలేక.. చైన్ స్నాచర్గా మారిన భర్త..!!

IMG 20250719 WA1466

*నెలకు ఆరు వేల భరణం కట్టలేక.. సెకండ్ వైఫ్ను పోషించలేక.. చైన్ స్నాచర్గా మారిన భర్త*

దొంగతనాల వెనుక మోటో కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంటుంది. కొందరు ఏ పని చేతకాక.. సోమరితనంతో.. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడుతుంటారు. మరికొందరు పరిస్థితుల కారణంగా దొంగలుగా మారుతుంటారు. దీనికి సరైన ఉదాహరణే ఈ స్టోరీ. భార్యకు భరణం చెల్లించడం కోసం దొంగగా మారిన వ్యక్తి చెప్పిన విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.

భార్యకు భరణం కట్టేందుకు దొంగతనం చేసిన ఘటన మహారాష్ట్ర నాగ్ పూర్ సమీపంలో చోటు చేసుకుంది. మన్కాపూర్ లోని గణపతినగర్ కు చెందిన కన్నయ్య నారాయణన్ బౌరుషి అనే వ్యక్తి చైన్ స్నాచింగ్ చేసి దొరికిపోయాడు. 74 ఏళ్ల మహిళ మెడలో చైన్ దొంగిలించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

జయశ్రీ జైకుమార్ గాడే అనే 74 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 22న మనిష్ నగర్ ఏరియాలో తన చైన్ ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో కేసు బుక్ చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు చైన్ స్నాచర్ ను పట్టుకున్నారు.

*భరణం చెల్లించేందుకే..*

చైన్ కేసు ఫిబ్రవరీలో కంప్లైంట్ ఇస్తే మొత్తానికి జులై లో దొరికిపోయాడు దొంగ. కెమెరాలు, స్థానిక దొంగల నుంచి లభించిన వివరాలతో ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే విచారణ సందర్భంలో కన్నయ్య చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్ అయ్యారు. తప్పని పరిస్థితుల్లో దొంగతనాలకు అలవాటు పడినట్లు చెప్పాడు. నెలకు రూ.6 వేలు తన మాజీ భార్యకు భరణం చెల్లించాలని.. అందుకే చైన్ స్నాచింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. విడాకుల కేసులో తన భార్యకు నెలకు రూ.6000 చెల్లించాల్సిదిగా కోర్టు తీర్పు ఇచ్చిందనీ.. అప్పటినుంచి దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పాడు.

కన్నయ్య కోవిడ్-19 (కరోనా) సమయంలో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే గత రెండేళ్లుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడు. కోర్టు తీర్పు ప్రకారం నెలనెలా భరణం కట్టాల్సి ఉందని.. ఉద్యోగం లేక.. డబ్బులు లేక దొంగతనాలు చేసి భరణం చెల్లిస్తున్నట్లు చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు పోలీసులు. ఈ రెండు మూడు నెలల్లో నాలుగు చైన్ స్నాచింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు.

*గోల్డ్ వ్యాపారి అరెస్టు:*

విచారణలో గోల్డ్ ఎక్కడ అమ్ముతున్న విషయం చెప్పాడు కన్నయ్య. దొంగిలించిన గోల్డ్ ను కొంటున్న వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ సాయి జువెల్లర్స్ కు చెందిన అమర్దీప్ కృష్ణారావు నఖతే ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చట్టప్రకారం దొంగిలిచన సొమ్మును కొనటం, అమ్మటం నేరం అని చెప్పారు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. అతను అమ్మిన వస్తువులు కొన్న వారిని ఐడెంటిఫై చేశారు. వారి నుంచి ఒక బైక్, మొబైల్ ఫోన్, 10 గ్రా. బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు పోలీసులు.

 

Exit mobile version