హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేయాలి-

HCA హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేయాలి- తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్.

 

మూడు వందల కోట్లకు పైగా అవినీతికి పాల్పడి , రూరల్ క్రికెట్ క్రీడాకారులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న HCA ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు యెండల లక్ష్మీ నారాయణ, గురువా రెడ్డిలు డిమాండ్ చేశారు..పంజగుట్ట టూరిజం ప్లాజాలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA);బీసీసీఐ గుర్తింపు కోసం గత పది సంవత్సరాల నుంచి ఎడతెరిపిలేని పోరాటం చేస్తున్నది..ఇందులో భాగంగా 2021 జులైలో HCA (హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్) TCA రెండు కోలబ్రేట్ అయ్యి రాష్ట్రవ్యాప్త అసోసియేషన్ నిర్మించుకోవాలని BCCI చెప్పింది.మూడు సంవత్సరాలైనా HCA లెక్కచేయటంలేదు. జిల్లాల క్రికెట్ తో ఏ సంబంధాలు లేకున్నా, వాళ్లకు అక్కడ పట్టు లేకున్నా గత పది సంవత్సరాల నుంచి వేలాదిమంది క్రికెట్ క్రీడాకారులను తయారు చేస్తున్న టీసీఏకు TCA కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు..

పైగా గత పది సంవత్సరాల అకౌంట్స్ కు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన సంస్థల రిపోర్ట్ ప్రకారం HCA లో దాదాపు 300 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ జరిగింది.HCA లో ఉన్న అధికార సభ్యుల పైన ఏసీబీ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఐదు సార్లు రిటైర్డ్ జడ్జిలతో కమిటీలు వేసి HCA ప్రక్షాళనకు పూనుకున్నా, కుక్క తోక వంకర లాగా వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోకుండా పదేపదే అవినీతికి లోబడుతూ క్రీడాకారులకు అన్యాయం చేస్తూ జిల్లాలకు చెందిన క్రికెట్ ను కుంటుపరుస్తోంది. HCA తన సొంత తప్పులు తెలుసుకోకుండా అవినీతి మీద అవినీతి జరుపుతూ పోతున్నది.కాబట్టి బీసీసీఐ మెంబర్షిప్ రూల్ 3B3 ప్రకారం గత పది సంవత్సరాల నుంచి HCA డిస్క్ క్వాలిఫైడ్ మెంబర్ కాబట్టి, వెంటనే అవినీతితో కూడుకున్న HCA ను రద్దుచేసి తెలంగాణ రాష్ట్రానికి HCA రక్కసి నుండి విముక్తి కలిగించాలని కోరుతూ TCA కు వెంటనే బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని, తెలంగాణ జిల్లాలు రూరల్ క్రీడాకారులు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు అందరికి కూడా దేశవాళి క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్లో ఆడడానికి TCA ద్వారా బీసీసీఐ గుర్తింపునివ్వాలని TCA డిమాండ్ చేసింది.ఈ సమావేశంలో సభ్యులు కపిలవాయి రవీందర్, ప్రేమ్ కుమార్, మహేందర్ రెడ్డి, నవరసన్,నాగరాజు,గౌరవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now