గ్రామ పాలనాధికారుల నియామక ఉత్తర్వుల కోసం హైదరాబాద్ పయనం

గ్రామ పాలనాధికారుల నియామక ఉత్తర్వుల కోసం హైదరాబాద్ పయనం

కామారెడ్డి, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):

గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారిని హైదరాబాద్ తరలించేందుకు 7 ప్రత్యేక బస్సులు.జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ కార్యాలయం వద్ద పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభం.

రెవెన్యూ శాఖలో తిరిగి నియామకం పొందుతున్న 363 మందిలో 335 మంది హైదరాబాద్ ప్రయాణం.

గతంలో విఆర్వోలు, విఆర్ఏలుగా పనిచేసిన వారికి పరీక్ష ఆధారంగా నియామక ఉత్తర్వులు.హైటెక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వుల ప్రదానం.

మాతృశాఖలో తిరిగి సేవ – కలెక్టర్ సూచనలు

కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 7 ప్రత్యేక బస్సులలోగ్రామపాలనాధికారులుగా ఎంపికైనవారిని హైదరాబాద్‌కు తరలించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

గతంలో రెవెన్యూ శాఖలో విఆర్వోలు, విఆర్ఏలుగా పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని ప్రభుత్వం తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో కామారెడ్డి జిల్లాకు 363 మందిని కేటాయించగా, వారిలో 335 మందిని ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ తరలించారు.హైటెక్స్ వేదికగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులుఅందజేయబడతాయి.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “మాతృశాఖ అయిన రెవెన్యూ శాఖలో తిరిగి సేవ చేసే అవకాశం రావడం గర్వకారణం. ఉత్తమ సేవలందించి శాఖ ప్రతిష్ఠను పెంచాలి” అని సూచించారు.

ఈ బస్సులలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, కలెక్టరేట్ ఏవో సయీద్ మసూద్ తదితరులు కూడా వెళ్లారు.

Join WhatsApp

Join Now