హైదరాబాద్‌ నుంచి అయోధ్య విమాన సర్వీసులు..

IMG 20240928 WA0020

హైదరాబాద్‌ నుంచి అయోధ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో విమాన సర్వీసులను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క నెలలోనే హైదరాబాద్‌ నుంచి ఏడు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి రాజ్‌కోట్‌, అగర్తలా, జమ్మూ సర్వీసులు ఇటీవలే ప్రారంభమయ్యాయని తెలిపారు. శుక్రవారం నుంచి కాన్పూర్‌, అయోధ్యకు విమాన సేవలను ప్రారంభించామని చెప్పారు. శనివారం నుంచి ప్రయాగ్‌ రాజ్‌, ఆగ్రాకు సర్వీసులు ప్రారంభం కానున్నాయని కిషన్‌రెడ్డి వివరించారు.

Join WhatsApp

Join Now