Site icon PRASHNA AYUDHAM

బాలానగర్ నాలా ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

IMG 20250703 220224

బాలానగర్ నాలా ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ప్రశ్న ఆయుధం జులై03: కూకట్‌పల్లి ప్రతినిధి

” బాలానగర్ నాలా ఆక్రమణల గురించి టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఫిర్యాదులు చెయ్యగా నాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ”

” నాలాలపై ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి కళ్యాణ్ నగర్, రాజు కాలనీ, ఫతే నగర్ వాసులకి వరదల నుంచి విముక్తి కలిగించాలి టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం డిమాండ్.”

కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ నాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బాలానగర్ నాలా ఆక్రమణల గురించి టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఫిర్యాదులు చెయ్యగా ఏవీ రంగనాథ్ ఈ రోజు క్షేత్ర స్థాయిలో సాయి నగర్, వినాయక్ నగర్, చెరబండ రాజు నగర్ లలో పర్యటించి ఏవీ రంగనాథ్ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. సత్యం శ్రీరంగం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున చెరువులు, నాళాలు కబ్జాలను ప్రొత్సహిచిందని, వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలం అయిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న చర్యలు చేపట్టలేరని అప్పటి మున్సిపల్ శాఖ మాత్యులు కేటీర్, కలెక్టర్, కమిషనర్ కి ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదు అని అన్నారు. బాలానగర్ నాలా ఆక్రమణలు అన్ని క్లియర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసారు. ఈ నాలా వల్ల ఇళ్లలోకి నీళ్లు చేరి కళ్యాణ్ నగర్, చెరబండ రాజు కాలనీ, రాజు కాలనీ, వినాయక్ నగర్ మునిగిపోతున్నాయి అని గతంలో బిఆర్ఎస్ హయాంలో అనేక సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించు కోలేదు అని రంగనాథ్ ఇప్పుడైనా సరే సామాన్య ప్రజలకు న్యాయం చేసి, నాళాల పై కబ్జాలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పుష్పా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మధు గౌడ్, పులి శ్రీకాంత్ పటేల్, యూగేందర్ రెడ్డి, ఆకుల నరేందర్, పులి శివకుమార్ గౌడ్, మధు మోహన్, భరత్, కల్యాణ నగర్ సంక్షేమ సంఘము అధ్యక్షులు యూసఫ్ భాయ్, మహిళా అధ్యక్షురాలు రేణుక, మహేందర్, శేఖర్ గజానంద్, జల్లా శివ, సాయి భారతి, రవి గౌడ్, సదా గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రామ్మోహన్, అనిల్, సత్యపాల్, కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version