కూల్చివేతలపై హైడ్రా దిద్దుబాటు..
చెరువుల పరిరక్షణే హైడ్రా లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చబోదని ఆయన స్పష్టం చేశారు. గొలుసుకట్టు చెరువులు హైదరాబాద్ స్వంతమన్నారు. కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో హైడ్రాపై అసత్య ప్రచారం ప్రారంభమైందని రంగనాథ్ వివరించారు. హైడ్రాపై అపోహలు తొలగించుకోవాలని ఆయన కోరారు. హైడ్రా కార్యకలాపాలు కేవలం ఔటర్ రింగ్ రోడ్డు వరకే చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ నుంచి సూర్యపేట వరకు మూసీ పరివాహ ప్రాంతం ఉంది. అయితే హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేస్తున్నట్లు రెడ్ మార్కులు వేసింది. బిజెపి, బిఆర్ఎస్ న్యాయ విభాగాలు పేదల తరపున పోరాడుతున్నాయి. ప్రజా ఆందోళన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. బిజెపి నుంచి ఈటెల సీరియస్ గానే ఉన్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా ఈటెల ఖండిస్తున్నారు.బిఆర్ఎస్ కూడా హైడ్రా బాధితుల తరపున నిలుస్తోంది. హైడ్రా కూల్చివేతలకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూం ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ అదేప్రభుత్వం బాధితుల తరపున లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. దానం నాగేందర్ కూడా కూల్చివేతల్లో పేదప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరముందన్నారు.
Post Views: 5