హైడ్రా అనేది కొద్దిరోజుల హడావిడి మాత్రమే
హైడ్రా తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఫైర్..
హైడ్రా మరియు తెలంగాణ ప్రభుత్వం పై కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చడానికి హైడ్రాను ఏర్పాటు చేసింది. కానీ హైడ్రా రాత్రికి రాత్రి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని ఈఎంఐ లు చెల్లిస్తూ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లను ఎలా కూల్చివేస్తారు. ఆ అపార్ట్మెంట్లు కొనుక్కున్న సామాన్యుల పరిస్థితి ఇప్పుడు ఏమిటి..ఆ అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేసి, జైల్లో ఎందుకు వేయరు.. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు తీసుకుని ఉన్న అపార్ట్మెంట్ ను కూల్చివేసినప్పుడు ఎవరైతే ఈ అపార్ట్మెంట్ కు ఏఏ డిపార్ట్మెంట్ల నుండి పర్మిషన్లు ఇచ్చారో వారు కూడా దీనికి బాధ్యులే కదా, వారిని కూడా సస్పెండ్ చేసి జైల్లో వేయాల్సిందే కదా.. అక్రమ కట్టడాలలో ఉన్న అపార్ట్మెంట్ కు లోన్లు ఇచ్చిన బ్యాంకు అధికారులను కూడా జైల్లో వేయాలి కదా..ఇంతకు ముందున్న కెసిఆర్ ప్రభుత్వం డ్రగ్స్ విషయంపై కొంతకాలం హడావిడి చేసింది ఇప్పటివరకు అది ఏమైందో ఎవరికీ తెలియదు. అలాగే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా ఫోన్ టాపింగ్ అంటూ కొంతకాలం, ఆ తర్వాత కాళేశ్వరం, మేడిగడ్డ అంటూ కొంతకాలం, ఇప్పుడు హైడ్రా అంటూ కొద్దిరోజుల హడావిడి మాత్రమే చేస్తారు. పర్మిషన్లు లేని వాటిని ఇప్పుడు కూల్చేస్తున్నారు కరెక్టే,, వచ్చేసారి వేరే ప్రభుత్వం వస్తే కూల్చివేసిన స్థలంలో మళ్లీ పర్మిషన్లు ఇస్తే ఎట్లా.. ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యకు పరిష్కారం చూపెట్టి , అన్ని రకాలుగా పర్మిషన్లు ఇచ్చిన అధికారులను ఎందుకు బాధ్యులను చేయరో ప్రభుత్వం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.