ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా…

*తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..*

 

– *దానం నాగేందర్‌*

 

తిరుమల: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలు, చెరువులు అన్యాక్రాంతమయ్యాయన్నారు. అనేక ప్రదేశాల్లో కబ్జాలను తొలగించేందుకు హైడ్రా తీసుకువచ్చామన్నారు. హైకోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అన్యాక్రాంతమైన ప్రాంతా ల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసే అంశాలపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమే తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.

 

విభజన తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీని పట్టుకుని బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే అంటూ మాట్లాడటం దారుణమన్నారు. ఏపీ, తెలంగాణ అనే విభేదాలు పుట్టించి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసేలా జరుగుతున్న కుట్రపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పకుండా బీఆర్‌ఎస్‏కు బుద్ధి చెప్తారన్నారు. తన మనవరాలి పుట్టువెంట్రుకలు సమర్పించేందుకు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు.

Join WhatsApp

Join Now