చెరువుల రక్షణకే హైడ్రా..!”

*హైడ్రా వెనుక ఏ రాజకీయం లేదు: సీఎం రేవంత్ రెడ్డి*

 

*చెరువుల రక్షణకే హైడ్రా*

 

*పకృతి విపత్తు రాకుండా చూడాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం*

 

*హైదరాబాద్:సెప్టెంబర్ 17*

 

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి గన్​పార్కులో ఈరోజు ఏర్పాటు చేసిన సభలో అమరవీరులకు నివాళులు అర్పించారు.

 

అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్క రించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించా రు. ప్రతి సంవత్సరం సెప్టెం బర్ 17న ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

 

తాను ఫామ్‌హౌస్ సీఎం కాదని, పని చేసే సీఎం అని చెప్పారు. ఐక్యత, సమైక్య తను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా రని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని మండిపడ్డారు.

 

గత పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగింది. కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతా యుతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతామని పేర్కొన్నారు.

 

లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారని బిఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహించారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలని కోరారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదన్నారు.

 

కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారని అన్నారు. ఎవరు అడ్డుకున్నా హైడ్రా ఆగదు ప్రజలు చెరువుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పనికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి,కోరారు….

Join WhatsApp

Join Now