జాతీయ కరాటే పోటీల్లో సైబరాబాద్ కానిస్టేబుల్‌కు రెండు బంగారు పతకాలు
బెంగళూరులో మెరిసిన ఉప్పరపల్లి యువకుడు వల్లపు సుధాకర్
“నేనొక పేద రైతు బిడ్డ… నా వెనుక గ్రామస్తులే” – సుధాకర్
డ్రగ్స్‌కు బానిస కాకూడదని యువతకు ఎస్‌ఐ సూచన
కరాటేతో పాటు క్రికెట్‌లోనూ రాణిస్తున్న ప్రతిభ
గ్రామస్తుల ఘన సన్మానం, యువతకు ఆదర్శం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 8:
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సైబరాబాద్ కానిస్టేబుల్ వల్లపు సుధాకర్, బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తెలంగాణ తరఫున రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. పేద రైతు కుటుంబంలో పుట్టిన సుధాకర్, పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, మధ్యలో చిన్న చిన్న పనులు చేస్తూ డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్ నుంచే కరాటే, క్రికెట్ కోచింగ్ తీసుకుని కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఇక్బాల్ క్రికెట్ అకాడమీ తరఫున లీగ్ మ్యాచ్‌లలోనూ రాణిస్తున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తపనతో పోలీసు వ్యవస్థలో చేరి, డ్యూటీతో పాటు జివిఆర్ కరాటే అకాడమీ తరఫున జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ విజయానికి ఊరంతా ఆనందం వ్యక్తం చేసింది. గ్రామ పెద్దలు సుధాకర్‌ను యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట్ ఎస్‌ఐ శశివర్ధన్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.