Site icon PRASHNA AYUDHAM

దుష్టశిక్షణకు నేను సైతం..!ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

దుష్టశిక్షణకు నేను సైతం..!

 షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఘనంగా దసరా వేడుకలు..

 బంగారు మైసమ్మ ఆలయ ధర్మకర్త అందేమోహన్ ఆధ్వర్యంలో రావణ దహనం – బాణాసంచా..

షాద్ నగర్ లో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు.

 వేలాదిగా తరలివచ్చిన షాద్ నగర్ ప్రజానీకం

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తాను కూడా ఎల్లప్పుడూ సిద్ధమేనని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. విజయదశమి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ఆవరణలో జరిగిన దసరా వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీ బంగారు మైసమ్మ ఆలయ ధర్మకర్త అందేమోహన్ సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగిన దసరా సంబరాల్లో రావణ దహనం కోసం భారీ ఎత్తున బాణసంచా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పట్టణ పుర ప్రముఖులు ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా వేదమంత్రాల సాక్షిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రావణ దహన బాణసంచా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన దసరా వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. అనాదిగా సమాజంలో ఎక్కడ పోచట రాక్షసులు పడుతూనే ఉంటారని, వారి సంహరణ కోసం దైవం కూడా మానవ రూపం ధరిస్తుందని అన్నారు.

కొన్ని సందర్భాల్లో చెడు జరుగుతున్న అంతిమ విజయం మాత్రం మంచిదే అవుతుందని అన్నారు. ప్రజలు సమాజంలో శాంతి సామరస్యాలతో జీవించాలని అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుందని అన్నారు. మంచి చెడు బేరీజు వేసుకొని 

ముందుకు సాగిన వాడే మంచి మార్గాన్ని అనుసరించగలమని అన్నారు. దుష్ట శిక్షణకు తాను ఎప్పుడు సన్నద్ధంగా ఉంటానని అన్నారు. మంచి కోసం పాటుపడడమే తన లక్ష్యమని దానికి ఎన్ని అవరోధాలు అడ్డువచ్చిన వాటిని జయించి ముందుకు చదువుతానని అన్నారు. నేటికీ సమాజంలో కొందరు రాక్షసుల ప్రవర్తిస్తుంటారని అలాంటి వారి పట్ల సమాజం జాగ్రత్తతో ఉండాలని అన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నియోజకవర్గంలో మంచి పనుల కోసం మంచు కోసం పాటుపడతానని అన్నారు. సాటి మనిషికి సాయం చేయాలన్న దృక్పథంతో ఉంటానని అన్నారు. ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపదలో ఆదుకునేందుకు మానవత్వంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చిన నాడే లోక కళ్యాణం జరుగుతుందని అదే మన పూర్వీకులు నేర్పించారని గ్రంథాలు ఇతిహాసాలు కూడా చివరకు అవే చెబుతుంటాయని అన్నారు. 

 

 *శభాష్ అందె మోహన్..*

 

షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అందే మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ బంగారు మైసమ్మ ఆలయాన్ని నిర్మించి ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ విజయదశమి వేడుకలు చేపడుతుండడం అభినందనీయమని అన్నారు. దసరా వేడుకల సందర్భంగా సాంస్కృతిక సంప్రదాయ కార్యక్రమాలు ఈ ఆలయం వద్ద చేపడుతూ అమ్మవారిని ప్రతిష్టించి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్న అందే మోహన్ భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక భక్తి అలవర్చుకొని ఆలయాన్ని నిర్మించి పదిమందికి ఆధ్యాత్మిక తత్వం వైపు నడిపిస్తున్న తీరు హర్షనీయమని అన్నారు. శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించి దసరా సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినందుకు అందేమోహన్ సౌమ్య దంపతులతో పాటు స్థానిక యువనాయకుడు పులిమామిడి రాజేష్ గౌడ్ తదితరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.. 

Exit mobile version