Site icon PRASHNA AYUDHAM

అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను

IMG 20240724 WA1713

పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం- డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ అరవింద్

జమ్మికుంట ప్రశ్న ఆయుధం జులై 24

*ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఒజ్జా శ్రీకాంత్ మామిడి అరవింద్ అన్నారు విద్య రంగ సమస్యలు పరిష్కరించాలని అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తారా? గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్య రంగం పట్ల సరైన ప్రణాళికతో లేకపోవడంతోనే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పాఠశాలలకు పాఠ్యపుస్తకలు కూడా అందలేదని విద్యార్థుల హక్కులకై విద్యాభివృద్ధికై జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో విద్య రంగానికి 30% నిధులు కేటాయించలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనీ అడిగితే పోలీసులతో అక్రమంగా అరెస్టు చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పరిపాలన అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఓజ్జా శ్రీకాంత్ మామిడి అరవింద్ ఎర్ర రాజేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version