*స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పలేదు..*
*-మంత్రి సీతక్క*
స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని అన్నారు. *కేబినెట్లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని* వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు బహిరంగంగా ప్రకటన చేయడంపై ఇవాళ *టీపీసీసీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం* చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… *స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు స్పష్టత వస్తుందని భావిస్తున్నానని,* *బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంది.* బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో ఇవాళ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
*జైలుకు వెళ్లాలనే కుతూహలం కేటీఆర్కు ఉంది :* కవిత జైలుకు వెళ్లి రాగానే లిక్కర్ కేసుపై దృష్టి మళ్లించేందుకు బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. *కేటీఆర్ కూడా సానుభూతి కోసమో, రెచ్చగొట్టడానికే జైలుకు వెళ్లాలని భావిస్తున్నట్లున్నారని* అన్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వెళుతోంది ఎలాంటి కక్షలు లేవన్నారు. *కక్ష సాధింపే అయితే ప్రభుత్వం రాగానే జైళ్లలో వేసే వాళ్లం కదా* అని ప్రశ్నించారు. కక్షలు, కార్పణ్యాలు బీఆర్ఎస్ వాళ్లకే ఉంటాయని ధ్వజమెత్తారు. *రేవంత్ పౌరుషంతో మాట్లాడితే కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని* మంత్రి సీతక్క ఆగ్రహించారు. *జైలుకు వెళ్లాలనే కుతూహలం కేటీఆర్కే ఉన్నట్లు ఉందన్నారు*