నేను విష్ణు కోసం సినిమాకు వెళ్తా: ఆర్జీవీ
Jun 28, 2025,
నేను విష్ణు కోసం సినిమాకు వెళ్తా: ఆర్జీవీ
కన్నప్ప మూవీకి అందరూ ప్రభాస్ కోసం వెళితే.. తాను మాత్రం విష్ణు కోసం వెళ్తానని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, క్లైమాక్స్‌లో శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తిన్నడు తన కళ్లను అందించే సీన్‌లో విష్ణు పర్ఫార్మెన్స్ చూసి తనకు అద్భుతంగా అనిపించిందని తెలిపారు. ఒక నాస్తికుడిగా ఇది తనకు నచ్చదని, కానీ విష్ణు నటనతో తను ఈ సీన్‌లో మునిగిపోయేలా చేశాడని పేర్కొన్నారు. విష్ణును చూడటానికే కన్నప్ప మూవీకి వెళ్తానని వెల్లడించారు.