మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా..?

సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తూ బుధవారం రాత్రి మంగ్లీ వీడియో విడుదల చేశారు. 

“నా బర్త్‌ డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్‌ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. లిక్కర్‌, సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. లిక్కర్‌కు, సౌండ్‌ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా.. సడన్‌గా ప్లాన్‌ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునే దాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. తెలిసి అయితే.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. రిసార్ట్‌లో లోకల్‌ లిక్కర్‌ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు.. వాడలేదు. పోలీసులు సెర్చ్‌ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎరికైతే పాజిటివ్‌ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో .. ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను. మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా? ఒక రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటాను కానీ, ఇలాంటివి ఎందుకు చేస్తాను. మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్‌’’ అంటూ మంగ్లీ వీడియో విడుదల చేశారు.

*మంగ్లీ (ప్రముఖ సింగర్ & మాజీ ఏపీ ఎస్వీబీసీ సలహాదారు)*

Join WhatsApp

Join Now

Leave a Comment