ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు కృషి చేస్తాను

ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు కృషి చేస్తాను

ఎమ్మెల్సీ అభ్యర్థి యన్ జనార్దన్

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 12 , కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల స్వతంత్ర అభ్యర్థి నాంతాబాద్ జనార్దన్ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న సందర్బంగా కామారెడ్డిలో పలువురిని కలిసి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు పట్టభద్రులు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్న తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్ధన్ న్యాంతాబాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకి రెగ్యులైజేషన్ చేయించాడనికి కృషి చేస్తానని వాగ్దానం ఇచ్చారు. పట్టభద్రులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19600 ఉద్యోగులకు తన పూర్తి మద్దతు ఉంటుందని నాంతాబాద్ జనార్దన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి యువ నాయకునిగా తనని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎల్లవేళలా మీకు తోడుగా ఉండి సమస్యలపై పోరాడుతానని అన్నారు. కామారెడ్డిలో తనకు మద్దతు తెలుపుతున్న పట్టభద్రుల కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now