Site icon PRASHNA AYUDHAM

IAS వాణీప్రసాద్‌కు తప్పిన ప్రమాదం.

IAS
Headlines :
  1. పెను ప్రమాదం తప్పిన వాణీప్రసాద్: కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది
  2. సూర్యాపేటలో IAS వాణీప్రసాద్‌కు పెను ప్రమాదం
  3. స్వల్ప గాయాలతో బయటపడ్డ IAS వాణీప్రసాద్
  4. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా వాణీప్రసాద్ కారు ప్రమాదం

ఏపీ కార్మికశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకుపాముల దగ్గర IAS వాణీప్రసాద్ కారు సోమవారం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వాణీప్రసాద్ స్వల్పగాయాలతో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాణీప్రసాద్‌ను సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Exit mobile version