జేఎన్టీయూహెచ్‌లో ఐ సి ఆర్ ఎ 2025 శాటిలైట్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహణ

జేఎన్టీయూహెచ్‌లో ఐ సి ఆర్ ఎ 2025 శాటిలైట్ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిర్వహణ

ప్రశ్న ఆయుధం మే20: కూకట్‌పల్లి ప్రతినిధి

IMG 20250520 WA2634

నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జె ఎన్ టి యు హెచ్) లోని ఐ ఈ ఈ ఈ స్టూడెంట్ బ్రాంచ్, హైదరాబాద్ సెక్షన్‌కు చెందిన ఐ ఈ ఈ ఈ రాస్ సొసైటీ సహకారంతో, ఐ ఈ ఈ ఈ అంతర్జాతీయ రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (ఐ సి ఆర్ ఎ) 2025 యొక్క తొలి శాటిలైట్ కాన్ఫరెన్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మం విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల లోని ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం గోల్డెన్ జూబిలీ సెమినార్ హాల్‌లో జరిగింది.

ఐ సి ఆర్ ఎ 2025 అనేధి ఐ ఈ ఈ ఈ రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రఖ్యాత ఫ్లాగ్‌షిప్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు తమ ఆలోచనలు పంచుకుంటూ నూతన ట్రెండ్‌లపై చర్చిస్తారు. ప్రధాన కాన్ఫరెన్స్ అట్లాంటా నగరంలో జరుగుతుండగా, ప్రపంచంలోని అనేక శాటిలైట్ కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

ఈ 30 శాటిలైట్ కేంద్రాలలో ఒకటిగా జె ఎన్ టి యు హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎంపిక చేయబడింది. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న ఈ క్యాంపస్ అనేక విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో పాల్గొనడానికి అనుకూలంగా ఉండేలా చేసింది. 8,000 మందికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాల్గొనేవారు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

ఈ శాటిలైట్ కాన్ఫరెన్స్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ చీఫ్ గెస్ట్‌గా డా. కె. విజయ కుమార్ రెడ్డి (రెక్టర్, జె ఎన్ టి యు హెచ్), గౌరవ అతిథిగా శ్రీ నారాయణ జి.పి.ఎల్. మందలీకా (మాజీ ఉపాధ్యక్షుడు & చీఫ్ సైంటిస్టు – TCS, డిప్యూటీ చైర్ – IEEE DIITA) హాజరై రోబోటిక్స్ రంగంపై విలువైన అభిప్రాయాలను తెలియజేశారు.

డా. కె. విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,

“ఈ ఐ సి ఆర్ ఎ 2025 కోసం శాటిలైట్ కాన్ఫరెన్స్ కేంద్రంగా ఉండడమే కాక, 2030 నాటికి ICRA యొక్క ప్రధాన కేంద్రంగా మారడం జె ఎన్ టి యు హెచ్ యొక్క లక్ష్యం” అని తెలిపారు.

శ్రీ నారాయణ జి.పి.ఎల్. మందలీకా మాట్లాడుతూ,

“రోబోటిక్స్ రంగం మానవీయ విలువలు – గౌరవం, సమావేశం, వ్యక్తిత్వం, నమ్మకం, స్వతంత్రత మొదలైన వాటిపై ఆధారపడి నియంత్రించబడాలి. IEEE DIITA ద్వారా ఈ ప్రమాణాలను అభివృద్ధి చేయడం ద్వారా రాబోయే రోబోటిక్స్ ప్రపంచం మనుషులందరికీ మరింత అందుబాటులోకి వస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ తరహా శాటిలైట్ కాన్ఫరెన్స్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు చర్చలు జరిపే గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి.

ఈ కార్యక్రమాన్ని డా. కె. అనితా శీల (ప్రొఫెసర్, ECE & బ్రాంచ్ కౌన్సెలర్ – IEEE స్టూడెంట్ బ్రాంచ్ జె ఎన్ టి యు హెచ్), డా. సుధర్శన్ జయబాలన్ (చైర్, ఐ ఈ ఈ ఈ రాస్ సొసైటీ– హైదరాబాద్ సెక్షన్), డా. కె.పి. సుప్రీతి (విభాగాధిపతి, సి ఎస్ ఇ) సమర్థంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now