*మరో 15 ఏళ్లు సీఎంగా రేవంత్ ఉంటే…*
TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే మరో 15..20 ఏళ్లు సీఎంగా ఉంటానని అన్నారు. తాను సీఎంగా ఉంటే.. తమ బతుకు బస్టాండ్ అవుతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని రేవంత్ విమర్శించారు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పండ బెట్టారని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ పాపాల భైరవుడు కేసీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.