Site icon PRASHNA AYUDHAM

నాకు నచ్చినట్లు,నేను మెచ్చినట్లు నేను అంతలా ప్రేమిస్తే..

IMG 20240811 WA0048నిజంగా నాకు నచ్చినట్లు,నేను మెచ్చినట్లు నేను అంతలా ప్రేమిస్తే.. నా జీవిత పర్యంతరం వరకువారిని వదిలిపెట్టను.ఒక్కసారి నాకు అసహ్యం వేసేలా.. వారి ప్రవర్తన ఉందని నేను భావిస్తే, వారి నుండి నేను దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను.నేను పెద్దపెద్ద చదువులు చదవలేదు అనుకుంటా కానీ… అవసరాన్ని బట్టి నాటకాలు వేసే మనుషులను అర్థం చేసుకోవడంలో… PH.D. Complete చేశా.!!_* కాలం నేర్పిన పాటల కంటే, నమ్మిన నా వారు నేర్పిన గుణపాటాలే ఎక్కువ నా జీవితంలో.అందుకే “నిజం” నా వైపు ఉన్నప్పుడు మౌనం వహించడమే మంచిది అని భావించ.”అబద్ధానికి” మాత్రమే… కొనసాగింపులు, వివరణలు ఉంటాయి కానీ… నిజాన్ని ఒప్పుకున్నప్పుడే దానికి ముగింపు ఉంటుంది.!!ఆస్తులు, అంతస్తులు ఎవరైనా… ఎలాగైనా..సంపాదిస్తారు కానీ,సమాజంలో “నమ్మకం” సంపాదించాలి అంటే…”క్యారెక్టర్ “ఉండాలి. క్యారెక్టర్ లేకుంటే నాదృష్టిలో అన్ని కోల్పోయినట్టే.గుర్తించలేని గుడ్డితనం ముందు…”నిజాన్ని” నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.అందుకే,_నేను తినే మెతుకుమీద దెబ్బకొట్టిన వారినైనా క్షమిస్తాను కానీ… నా బ్రతుకు మీద దెబ్బకొట్టిన వారిని మాత్రం జీవితంలో అస్సలు క్షమించను. మీ అనిల్ పటేల్ మునూరు కాపు…

Exit mobile version