మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్
మైనర్ వాహనాలు నడిపితే కఠిన చర్యలు….
సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 19సారంగాపూర్
నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీస్ వారు
నిర్మల్ జిల్లా SP డా,, జానకీ షర్మిల ఐపీస్, సూచనల మేరకు సారంగాపూర్ మండల పరిధిలో మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.. ఈ తనిఖీల్లో భాగంగా 5 బైక్ లపైన జరిమానా విధించడం జరిగింది. మరియు ద్విచక్ర వాహనాలు నడిపిన మైనర్ అబ్బాయిలకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా తెలియచేయునది ఎటువంటి పరిస్థితిల్లో మైనర్ పిల్లలకు తల్లితండ్రులు వాహనాలు ఇవ్వకండి, చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన యెడల వాహనాల యజమానుల పైన కూడా చర్యలు తీసుకోబడును….. ఈ స్పెషల్ డ్రైవ్ లో సారంగపూర్ ఎస్సై శ్రీకాంత్ మరియు మండల పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది