మొబైల్ ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి.
మద్దూరు ఎస్సై షేక్ మహబూబు
మండలంలోని సలాఖపురం గ్రామానికి చెందిన చేట్కూరి రాజు అలాగే రేబర్తి గ్రామానికి చెందిన గవ్వల శ్రీనివాస్ తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్తూ తమ సెల్ ఫోన్లు పోగొట్టుకున్నామని మద్దూరు పోలీస్ స్టేషన్ వచ్చి పిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వెతికి తిరిగి వారి వారికి అప్పగించారు.మద్దూరు దూల్మిట్ట మండలాల పరిధిలో గల ప్రజలు ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే మద్దూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగలరని మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్ ఒక ప్రకటనలో తెలిపారు….