దేవాదుల లేకపోతే జనగామ ప్రాంతం ఎడారిగా మారేది: ఎమ్మెల్యే యశస్విని

దేవాదుల లేకపోతే జనగామ ప్రాంతం ఎడారిగా మారేది: ఎమ్మెల్యే యశస్విని

జనగామ జిల్లా, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):

లింగాల ఘనపూర్ మండలంలోని నవాబ్ పేట రిజర్వాయర్ నుండి నీటి విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల్ల కిరణ్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొనడం విశేషం.

రిజర్వాయర్ గేట్లను ప్రారంభించి నీటిని విడుదల చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవాదుల లేకపోతే జనగామ ఎడారిగా మారేదని, రైతులకు ఈ ప్రాజెక్టు ప్రాణాధారం అని ఎమ్మెల్యే యశస్విని వ్యాఖ్యలు.

మిగిలిన పనులకు రూ.1015 కోట్ల నిధులు మంజూరైనట్లు, పూర్తి అయితే నాలుగు నియోజకవర్గాల్లో 78 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

ప్రాజెక్టు ప్రాధాన్యం – రైతులకే లాభం

జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని నవాబ్ పేట రిజర్వాయర్ నుండి శుక్రవారం నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల్ల కిరణ్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. రిజర్వాయర్ గేట్లను ప్రారంభించి నీటిని విడుదల చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, “దేవాదుల లేకపోతే జనగామ ఎడారిగా మారేది. ఈ ప్రాజెక్టు రైతులకు ఆక్సిజన్ లాంటిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అన్నారు.

దేవాదుల మూడో దశలో ఆరవ ప్యాకేజీకి క్యాబినెట్ ఆమోదం లభించిందని, రూ.1015 కోట్ల నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక నాలుగు నియోజకవర్గాల్లో 78 వేల ఎకరాలకు, నవాబ్ పేట రిజర్వాయర్ ద్వారా మూడు మండలాల్లో 43 వేల ఎకరాలకు సాగునీరు చేరుతుందని వివరించారు.

“దేవరుప్పుల, లింగాల ఘనపూర్, గుండాల మండలాల్లో ఇక ఒక్క పంటకే కాకుండా రెండు పంటలకు నీరు అందుతుంది. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీరు విడుదల అవుతుంది కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకోవాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఈఈలు, ఆర్డీవోలు, తహసీల్దార్, ఎంపీడీవోలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నరు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment