Site icon PRASHNA AYUDHAM

జనన ధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు… ప్రసవించింది ఒకరైతే పత్రం మరొకరికి..!

IMG 20250731 WA00061

జనన ధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు: ప్రసవించింది ఒకరైతే పత్రం మరొకరికి!

ప్రసవించిన తల్లికి కాకుండా, ఇతరుల పేరుపై పత్రాలు

మున్సిపల్, మీసేవా, ఆసుపత్రుల సిబ్బంది ప్రమేయంపై తీవ్ర ఆరోపణలు

ఆధార్‌ కార్డు మార్చి, పేర్లు సవరించి పత్రాలు జారీ

సంబంధం లేని విధంగా సర్‌నేమ్ మార్పులు

లక్షల్లో చలామణి అవుతున్న బోగస్ ధ్రువీకరణలు

కామారెడ్డి, జూలై 31:

జననం ఒక ఇంట్లో, ధ్రువీకరణ పత్రం మాత్రం మరో ఇంటికా? కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రజలను కలవరపెడుతోంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జిజిహెచ్లో ప్రసవించిన పాప కోసం ఆమె తల్లి ఎదురు చూస్తున్నా, అధికారాల చేతుల్లో మాత్రం ఆ పాపకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మరొకరి పేరుపై జారీ కావడం కలకలం రేపుతోంది.

ధ్రువీకరణ పత్రాల్లో ఘోర తప్పిదాలు:

మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్లు, మీసేవ నిర్వాహకులు, ఆసుపత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఒకే దారిలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఆధారాలు లేకుండానే పేరు మార్పులు, సరైన పత్రాలు లేకుండా ధ్రువీకరణలు, బినామీ పేర్లతో పత్రాల జారీ—

లక్షల్లో వ్యాపారం:

ప్రతిరోజూ డెలివరీలుగా ఆసుపత్రిలో కనీసం 10–20 జననాలు జరగగా, వాటిపై అక్రమ రీతిలో ధ్రువీకరణ పత్రాల కోసం వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పత్రానికి కనీసం ₹2,000 నుంచి ₹10,000 వరకు వసూలు చేస్తున్నట్లు స్థానికులు పేరోకొంటున్నారు.

పాప ఎక్కడ..?

మార్చి 17న కామారెడ్డి జిజిహెచ్‌లో పుట్టిన పాప మరుసటి రోజు నుంచే కనిపించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన పడుతున్నారు. తల్లి ఒంటరిగా తిరుగుతుండడం, పాప ఎక్కడ ఉందన్న ప్రశ్నకు సమాధానం లేకపోవడం… ఇది కేవలం అవకతవక కాదని, పాపను అమ్ముకున్నట్టు ఆ గ్రామంలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అధికారుల స్పందన ఏమిటి?

“ఫిర్యాదు రాకపోతే ఏం చేయగలం?” అంటూ చేతులెత్తేస్తున్న అధికారులు ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోతున్నారు. , ఈ విషయాలు తెలిసిన సంబంధిత జిల్లా అధికారులు మాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు రానిదే చర్యలు తీసుకోలెమని సంబంధిత అధికారులు అంటున్నారని పలువురు పేర్కొంటున్నారు .

Exit mobile version