పోలీసులే భాగస్వాములుఅయితే బాధితులకి న్యాయంజరిగేనా.

పోలీసులే భాగస్వాములుఅయితే బాధితులకి న్యాయంజరిగేనా.…? 

గత నెల ఆగస్టు 9 న ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, మహిళలు,పోలీసులు మరియు వారి అనుచరులు రమాదేవి ఇంటి పై దాడి చేసి కుటుంబం పై హత్యకు ప్రయత్నం చేయగా గాయాలతో బయటపడి ప్రాణాన్ని ఆరా చేతిలో పెట్టుకుని భయం గా బ్రతుకుతున్నారు. రమాదేవి ఇంట్లో చోరబడి చెట్లను నరికి వేస్తూ వస్తువులను ధ్వంసం చేస్తూ విలువైన వస్తువులను దస్తావేజులను పత్రాలను ఎత్తుకెళ్లి నానా విధాలుగా దుర్భాషలాడుతూ వారి ఇంటి హద్దులను చెరిపి వేసి అనేక రకాలుగా దౌర్జన్యానికి పాల్పడి భయానికి గురి చేసిన వైనం పై కుటుంబసభ్యులు అదే రోజు స్థానిక ఏసీపి కి ఫిర్యాదు చేయగా, మరుసటి రోజు త్రీ టౌన్ ఎస్ హెచ్ ఓ జాన్ రెడ్డి, ఏసీపి నరేందర్ వారి సిబ్బందితో వచ్చి అన్ని ఆధారాలు స్వీకరించి నేటికీ ఎఫైర్ చేయకపోవడం అరెస్టు చేయకపోవడం గల కారణాలు ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రమాదేవి ఇంటి పై దాడిలో ప్రత్యక్షంగా పోలీసులు పాల్గొనడంతో ఫిర్యాదు చేసిన నేటికీ ఎలాంటి చర్యలు తీసుకపోకపోవడంతో అనేక అనుమానాలకు తావు ఇస్తుంది. భవిష్యత్తులో రమాదేవి కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరిగిన ఎలాంటి నష్టం జరిగిన దానికి ఒంటెల సుమ,ఒంటెల సత్యనారాయణ రెడ్డి, మహిళలు పోలీసులు వారి అనుచరులు పూర్తి బాధ్యత అని ప్రజలు ప్రజాసంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. వెంటనే ఆగస్టు 9న రమాదేవి ఇంటి పై పాల్గొన్న వారందరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకొని ప్రజలు కోరుచున్నారు. గతంలో ఒంటెల సుమ, సత్యనారాయణ రెడ్డి, వారి అనుచరులు భారీ పేలుళ్లు కు పాల్పడగా, వావిలాలపల్లిలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి నా పోలీసులు, రెవెన్యూ, మునిసిపల్, ఆటవిశాఖ, అధికారులు,అనేక మంది తో పాటు వారి సాక్ష్యాన్ని రికార్డు చేయడం జరిగింది. ఆ కక్షలో భాగంగా వారి ఇంటిపై దాడి జరిగింది ప్రజలు తెలిపారు.

Join WhatsApp

Join Now