తక్షణమే బీడీ కార్మికుల జీవన భృతి పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేయకపోతే…ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తాం.:

బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా

“4016 జీవన భృతి ఇవ్వకుంటే

నిజామాబాద్ నుండి హైదరాబాద్ వరకు వేలాదిమందితో పాదయాత్ర చేస్తాం

IMG 20250109 230934

కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్,

తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు,-

ఎస్. సిద్ది రాములు …

రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన భృతి చెల్లించాలని బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్,తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర,అద్యక్షులు,ఎస్.‌సిద్ది రాములు డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ,తిలక్ గార్డెన్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలది మంది బీడీ కార్మకులతో భారీ ర్యాలి,పాత కలెక్టర్ వరకు ,అనంతరం, నిజామాబాద్,కలెక్టర్ కి,ప్రతి నిదుల తో వెల్లి వినతి పత్రం దాఖాస్తు,పారాలు,ఎ ఓ ,పీడీ ,కి ఇవ్వడం,జరిగింది,ధర్నా చౌక్ లో జరిగిన బీడీ జీవన భృతి ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ

2014లో అప్పటి (టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో బాల్కొండ ఎన్నికల సభలో బీడి కార్మికులకు అందరికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకోని అదికారంలోకి వచ్చిన తర్వాత

గత ప్రభుత్వం కేవలం 3 లక్షల మందికి 2016 ఇచ్చి

మిగిలిన 7 లక్షల మందికి ఇవ్వకుండా ఎగ్గొట్టిందిని

దండి వెంకట్, ఎస్. ‌సిద్ది రాములు విమర్శించారు.

★ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 4016 ఇస్తామని వాగ్దానం చేసింది కాబట్టి చే‌సిన వాగ్దానం అమలు ఇ

అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నికరంగా 8 నెలలు మాత్రమే పాలన సాగిసించినందున ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పోరాటం చేయడం లేదన్నారు‌.

తక్షణమే బీడీ కార్మికుల జీవన భృతి పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేయకపోతే తెలంగాణ అన్ని జిల్లాల నుండి వేలాదిమంది బీడీ కార్మికులతో పాదయాత్రలతో ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అంతకు ముందు తిలక్ గార్డెన్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ప్రదర్శనగా రైల్వే స్టేషన్ మీదుగా ధర్నా చౌక్ వరకు చేరుకోని అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో

బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత రాష్ట్ర నాయకులు ఎం. అజయ్, ఎస్.డి. మహిమూద్, ఎస్.డి.సయ్యద్, చాట్ల పోశవ్వ, అరుణ, బిఎల్ టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, సిరిసిల్ల నాయకులు, అజయ్, సిద్దిపేట, జిల్లా అధ్యక్షులు, శ్రీ హరి,కామారెడ్డి జిల్లా నాయకులు, కుమ్మరి రవి,నిజామాబాదు జిల్లా నాయకులు, బి,జగదీష్, స్తెయ్యద్, సూజాత,రేణుకా,

తెలంగాణ బహుజన టేకేదార్ యూనియన్, నాయకులు, ఏ,శ్రీ నివాస్,మరుతి,ప్రభాకర్, సుదర్శన్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment