కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విధించిన గడువులోపు ఆర్ఓపి నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే కూల్చి వేస్తాం

*కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విధించిన గడువులోపు ఆర్ఓపి నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే కూల్చి వేస్తాం*

*ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

*హుజురాబాద్ జూన్ 11 ప్రశ్న ఆయుధం*

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) నిర్మాణ పనులను బుధవారం రోజున స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు అనంతరం గంగాడి కృష్ణారెడ్డి రైల్వే అధికారులు, ఆర్ఓబి నిర్మాణ సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంపై వాకబు చేశారు దాదాపు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ పనుల జాప్యం వల్ల ప్రజలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సుమారు 70కోట్ల నిధులు ఆర్ఓబి నిర్మాణ కోసం కేటాయించిన పనులు ఇన్నేళ్లుగా మందకోడిగా కొనసాగుతూ వచ్చాయన్నారు. ఇటీవల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ పనుల అలసత్వంపై సంబంధిత రైల్వే అధికారుల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నెలరోజుల్లోపు ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే జెసిబి తో తామే కూల్చి వేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించడంతో ప్రస్తుతం ఆర్ఓబి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వే అధికారుల అశ్రద్ధ కాంట్రాక్టర్ అలసత్వం కారణంగా ఇన్నేళ్లుగా ఆర్ఓబి నిర్మాణ పనులు ముందుకు కొనసాగలేదని తెలిపారు. ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ ఇక్కడి ప్రజల కు ఎంతో ఉపయోగకరమని, ప్రయాణ కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద వేచి ఉండే సమయం తగ్గి , ప్రమాదాలు నివారించే పరిస్థితి ఉండడంతోపాటు ఈ ప్రాంతం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లతోపాటు, స్థానికులకు , ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా, సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విధించిన గడువులోపు రైల్వే ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి చేయాలని, లేకపోతే ఆర్ఓబిని కూల్చివేసి, ప్రజలకు క్షమాపణ చెప్తామని రైల్వే అధికారులను గంగాడి కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆర్ఓబి నిర్మాణ పనుల పట్ల అశ్రద్ధ వహించకుండా త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధి కాంట్రాక్టర్, రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, కమలాపూర్ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్,జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బండారి సుధాకర్, హుజరాబాద్ జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండల అధ్యక్షులు రాజు రమణారెడ్డి నరేష్ చిట్టీ సుందరయ్య, పిట్టల సతీష్, ర్యాకం సుధాకర్, pr శంకర్, దండబోయిన శ్రీనివాస్,ర్యాకం సదానందం, గుండెకారి శ్రీనివాస్,చీర్స్ లచ్చన్న, బండారి శ్రీనివాస్,అకినపెల్లి రవీందర్, ఎగ్గొజు శ్రీనివాస్, తోట రాంప్రసాద్,లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now