అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం…

*అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం…..శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ*

శింగనమల నియోజకవర్గంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలియజేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పెన్నా నుంచి తాడపత్రి వాసులు అక్రమంగా ఇసుకను యంత్రాలు ద్వారా తవ్వుతున్నారని నిదనవాడ గ్రామ రైతులు ఎమ్మెల్యే కి తెలియజేశారు. వెంటనే ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పందించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇసుకను తరలిస్తున్న వాహనాలను, వ్యక్తులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్న తరిమెల, నిదనవాడ, రాచేపల్లి, గ్రామాల రైతులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వెంటనే అక్కడికి చేరుకొని వాహనాలను సీజ్ చేశారు. పెన్నా నది నుంచి ఎవరైనా ఇసుకను తరలిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామన్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో వేలాదిమంది రైతులు బోర్లు వేసుకొని పంటలను సాగు చేస్తున్నారు. అక్రమంగా ఇసుకను తగిలిస్తే ఆ రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బంది గురువాతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment